Naa Praanamaa – Joel Kodali, Hadlee Xavier Telugu Christian Lyrics
Naa Praanamaa is the latest Christian single written & tuned by Telugu Christian song-writer, composer, Joel Sugunakar Kodali, sung by Kiran Kaki, Stephen Son, Rohith Ganta and music composed by renowned Christian Music Director, Hadlee Xavier. This song was released on October 04, 2021 through Joel Kodali YouTube channel.
Please listen to this song, worship the lord with truth and in spirit and be blessed.
Song : Naa Praanamaa
Release Date : October 04, 2021
Lyrics & Tune : Joel Kodali
Vocals : Kiran Kaki, Stephen Son, Rohith Ganta
Music : Hadlee Xavier
నా ప్రాణమా దిగులెందుకు – నీ రక్షకుని స్మరియించుకో
మహిమోన్నతుడు బలవంతుడు – నీ పక్షమునే నిలిచెను చూడు
లెవరా వీరుడా నిరాశను వీడరా నీ రాజు నిన్ను పిలిచెను
కదులు ముందుకు కదులు ముందుకు
అసాధ్యుడే నీకుండగా అసాధ్యము నీకుండునా
భయము వీడి నడవరా జయము నీదే జయము నీదే
- యేసులో విశ్వాసమే నీ చేతిలోని ఆయుధం
విడువకుండ పట్టుకో ఎన్ని శ్రమలు నీకు కలిగినా
లేమిలో కొలిమిలో ఒంటరివి కావు ఎన్నడూ
యేసు నీతో ఉండును నీ సహాయమాయనే
నీవు వెంబడించువాడు నీవు నమ్మదగిన దేవుడు
నీ శ్రమలు దూరపరచును నిన్ను గొప్పగా హెచ్చించును - గర్జించు సింహమువలె సాతాను వెంటపడినను
ఎదురుతిరిగి నిలబడు వాడు నిలువలేకపోవును
జయించెనేసు ఎన్నడో సాతాను ఓడిపోయెను
నీ ఎదుటనున్న శత్రువు ప్రభావము శూన్యమే
నీలోన ఉన్నవాడు లోకములనేలువాడు
నిర్భయముగా సాగిపో నిన్ను ఆపలేరు ఎవ్వరు - నీవు ఎక్కలేని కొండను ఎక్కించును నీ దేవుడు
నీవు చేరలేని ఎత్తుకు నిన్ను మోయునాయనే
నీ ప్రయాస కాదు వ్యర్థము యేసు గొప్ప ఫలము దాచెను
తన తండ్రి ఇంట నీకును సిద్ధపరిచెను నివాసము
ఊహించలేని మహిమతో ప్రభువు నిన్ను నింపివేయును
ఆశ్చర్యమైన స్వాస్థ్యము నీ చేతికప్పగించును
Na Praanamaa dhigulendhuku – nee rakshakuni smarinchuko
mahimonnathudu balavanthudu – nee pakshamune nilichenu choodu
Levaraa veerudaa niraasanu veedara nee raaju ninnu pilichenu
kadhulu mundhuku kadhulu mundhuku
asaadhyude neekundagaa asaadhyamu neekundunaa
bhayamu veedi nadavaraa jayamu needhe jayamu needhe
- Yesulo viswaasame nee chethiloni aayudham
viduvakunda pattuko enni sramalu neeku kaliginaa
lemilo kolimilo ontarivi kaavu ennadu
yesu neetho undunu nee sahaayamaayane
neevu vembadinchu vaadu neevu nammadhagina dhevudu
nee sramalu dhoora parachunu ninnu goppagaa hechinchunu - Gharjinchu simhamuvale saathaanu ventapadinanu
edhuru thirigi nilabadu vaadu niluvalekapovunu
jayinchenesu ennado saathaanu odipoyenu
nee edhutanunna sathruvu prabhaavamu soonyame
neelona unnavaadu lokamulaneduvaadu
nirbayamugaa saagipo ninnu aapaleru evvaru - Neevu ekkaleni kondanu ekkinchunu nee devudu
neevu cheraleni ethuku ninnu moyunaayane
nee prayaasa kaadu vyardhamu yesu goppa phalamu dhaachenu
thana thandri inta neekunu siddhaparachenu nivaasamu
oohinchaleni mahimatho prabhuvu ninnu nimpiveyunu
aascharyamaina swaasthyamu nee chethikappaginchunu
NAA PRANAMA DIGULENDUKU LYRICS TELUGU