Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Stuthiyu
Album: Srastha 3
Release Date: November 05, 2021
Lyrics & Composition: Devadas Mungamuri
Vocals: Nithya Mammen
Music: Prabhu Pammi
Producer : Jeeva R Pakerla
- Telugu
- English
రాగం: కాంభోజి
స్తుతియు మహిమయు నీకే – క్షితికిన్ దివికిన్ నీటి
వితతికిన్ కర్తవై – వెలయు మా దేవ
ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు
హితుడా మా ప్రేమ నీ – కెట్లు చూపుదును
- పసిడి వర్ణపుటెండ – భాగ్యధారల వాన
విసరు మంచిగాలి – విరియు పుష్పములు
రసమొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్ చాటున్
ప్రసరించు కోతలో – ఫలనుందు వీవు - నెమ్మదిగల యిండ్లు – నిజ సౌఖ్య కాలములు
ఇమ్మహి ఫలియించు – నైశ్వర్యాధికముల్
ఇమ్ముగ గలిగిన – హృదయులమై వందనమ్ములు
ఋణపడి – యున్నాము నీకు - దురితంబు లొనరించి – దౌర్భాగ్యస్థితి నున్న
ధరణికి నీ పుత్రున్ – ధర్మంబుజేసి
నరుల కిధర్మమున – కొరత దీర్చెడు సర్వ
వరము లమర్చిన – పరమోపకారి - జీవంబు ప్రేమను – జివను గల్గించెడు
పావనాత్మను మాకై పంపితివి
దీవెనలేడు రె – ా్లవరింపను మమ్ము
నీ విమలాత్మన్ మాలో గుమ్మరించు - నరులకు విమోచ – నముగల్గె పాపంబుల్
పరిహారమాయె గృ- పాసాధనములు
దొరికె మోక్షాంశము – స్థిరమాయె మేము నీ
కొరకేమి తేగలము పరిపూర్ణ జనక - మాకై వాడుకొనెడి – రూకల్ వ్యర్ధంబగును
నీకై యప్పుగనిచ్చు నిఖిల వస్తువులు
శ్రీకరంబగు నిత్య శ్రేష్ఠ ధన నిధియై పై
లోకంబు నందుండు – లోపంబు లేక - జీవంబు వస్తువులు – శ్రేయస్సు దాన స్వ-
భావంబు శక్తియు- భాగ్యంబులు
నీ వలననే లభ్యమై వెలయుచున్నవి
నీ వాసమే మాకు నిత్యానందంబు
Stuthiyu Mahimayu neeke – kshithikin divikin neeti
vithathikin karthaavai – velayu maa Deva
prathi vasthuvunu maaku bahumathigaa nichu
hithudaa maa prema nee – ketlu choopudhunu