Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Yelo Yelo Sambaralu 5
Release Date: November 05, 2022
Lyrics & Producer : Joshua Shaik
Vocals : Javed Ali
Music : Kamalakhar
- Telugu
- English
ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు
సంతోషాలే పొంగేనండీ – హైలెస్సా
దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే
సంగీతాలే పాడాలండీ – హైలెస్సా
అంధకారాన్ని తొలగించే మహనీయుడు
పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు
నిన్నే కోరి నిన్నే చేరి
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు
- లోకాలనేలేటి రారాజురా – ఉదయించె సూరీడై వచ్చాడురా
ఆకాశ వీధి – మెరిసేటి దారి – ఒకతార మురిసిందిగా
దూతాళి పాడి – కొలిచారు చూడు
ఘనమైన ఒక వేడుక
ఆ గొల్లలేగా – దరువేసే చూడు
మెస్సయ్య – పుట్టాడనీ
మన మెస్సయ్య – పుట్టాడనీ - వెన్నెల్లో పూసింది ఓ సందడీ – పలికింది ఊరంతా ఈ సంగతీ
ఈ దీనుడంట – పసిబాలుడంట – వెలిసాడు మహరాజుగా
మనసున్న వాడు – దయ చూపువాడు
అలనాటి అనుబంధమే
కనులారా చూడు – మనసారా వేడు
దిగి వచ్చే మనకోసమే
ఇల దిగి వచ్చే మనకోసమే - ఆ నింగి తారల్లా వెలగాలిరా – జగమంత చూసేలా బ్రతకాలిరా
వెలిగించు వాడు – మనలోని వాడు – నిలిచాడు మన తోడుగా
సలిగాలి రాత్రి – పిలిసింది సూడు
మనలోన ఒక పండగ
భయమేల నీకు – దిగులేల నీకు
యేసయ్య మనకుండగా
మన యేసయ్య మనకుండగా
Yelo yelo yelo antu – vachharandi gollalu
santhoshaale pongenandi hilessa
daare choope devudochhe – ullasanga ooru aade
sangeethaale paadaalandi hilessa
andhakaaraanni tholaginche – mahaneeyudu
puttinaadandi yesayya – mana devudu
ninne kori – ninne cheri
itta rakshincha vachhadu – paramaathmudu
- lokaalaneleti raaraajura – udayinche sooreedai vachhaduraa
aakaasa veedhi – meriseti daari – oka thaara murisindigaa
doothaali paadi – kolichaaru choodu
ghanamaina oka veduka
aa gollalega – daruvese choodu
messayya puttadani
mana mesayya puttadani - vennello poosindi oka sandadi – palikindi oorantha ee sangathi
ee deenudanta – pasi baaludanta – velisadu maharaajugaa
manasunnavaadu – daya choopuvaadu
alanaati anubandhame
kanulaara choodu – manasaara vedu
digivachhe mana kosame
ila digivachhe mana kosame - aa ningi taaralla velagaaliraa – jagamantha choosela brathakaaliraa
veliginchuvaadu – manalonivaadu – nicichadu mana thodugaa
saligaali raatri – pilisindi choodu
manalona oka pandaga
bhayamela neeku – digulela neeku
yesayya manakundaga
mana yesayya manakundaga