Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Yedabayani Nee Krupa
Album: Ganamaina Yessaiah Vol 9
Song Release Date: 2016
Lyrics: Pastor Mathews
Vocals: Hema Chandra
Music: JK Christopher
- Telugu
- English
పల్లవి:
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం
- శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో – నిరాశ నిస్పృహలో
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగా
కృపా కనికరముగల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి - విశ్వాస పోరాటంలో – ఎదురాయే శోధనలు
లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో
దుష్టుల క్షేమమునే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగా
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి - నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగా
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి
Yedabaayani Nee Krupa
Nanu Viduvadu Ennatiki
Yesayyaa Nee Premaanuraagam
Nanu Kaayunu Anukshanam
- Shokapu Loyalalo – Kashtaala Kadagandlalo
Kadaleni Kadalilo – Niraasha Nispruhalo
Ardhame Kaani Ee Jeevitham
Ika Vyardhamani Nenanukonaga
Krupaa Kanikaramugala Devaa
Naa Kashtaala Kadalini Daatinchithivi - Vishwaasa Poraatamlo – Eduraaye Shodhanalu
Lokaashala Alajadilo – Sadalithi Vishwaasamulo
Dushtula Kshemamune Choochi
Ika Neethi Vyardhamani Anukonaga
Deerghashaanthamugala Devaa
Naa Cheyi Viduvaka Nadipinchithivi - Nee Sevalo Eduraina – Enno Samasyalalo
Naa Balamunu Choochukoni – Niraasha Chendithini
Bhaaramaina Ee Sevanu
Ika Cheyalenani Anukonaga
Pradhaana Yaajakudaa Yesu
Nee Anubhavaalatho Balaparachithivi