Taragani Nee Prema – Lillian Christopher Telugu Christian Lyrics
Taragani Nee Prema is the Christian Telugu song written, tuned by Ps Subhakar Rao, sung by Lillian Christopher and music composed by JK Christopher. This song video was released on February 10, 2024 through JK Christophe YouTube Channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Taragani Nee Prema
Song Release Date: February 10, 2024
Lyrics, Tune: Ps Subhakar Rao
Vocals: Lillian Christopher
Music: JK Christopher
తరగని నీ ప్రేమ విరివిగ నాలో సిరులుకురిపించెనే
చెరగని నీ రూపు నిరతము నాలో సరిగమ పలికించెనే
ఆ|| ప || తంబుర సితార వాధ్యములతో స్వరమెత్తుకుని
తండ్రిదేవా మనసార నిన్నే ఆరాధింతును నీలో ఆనందింతును
- నిన్ను విడిచి నా హృదయం – వెనుకకు మరలునా
నన్ను పిలిచి ఉన్నత స్థలమున – పాదములు నిలుపగా
ప్రేమించి జీవవాక్యముతో పోషించింతివి
రక్షించి శాంతిజలముల చెంత నడిపితివి - నిన్ను తలచిన ప్రతీ క్షణం-ఆటంకము ఆపునా
నన్ను నడిపిన ప్రతీ స్థలం – అద్బుతములు చేయగా
దీవించి గొప్పచేయ మొదలు పెట్టితీవి
కరుణించి క్షేమాభివృద్దితో నింపితివి - నీతో గడిపిన మధురజ్ఞాపిక – నామదిలో మరుగాయేనా
నాతో పలికిన ప్రమాణము నెరవేరుచుండగా
నియమించి నిండుగాదీవెన పంచితివి
ఆత్మనింపి క్రీస్తు నీయందే నను పెంచితివి