Song: Sthothra Geethamulu
Release Date: April 27, 2024
Lyrics, Tune & Producer: Jeevan Wesley Olesu
Vocals: Krupanandhu Olesu
Music: Nimshi Zacchaeus
- Telugu
- English
స్తోత్రగీతములు యెహోవాకు పాడెదం
సంగీత స్వరములతో గానము చేసెదం
గళమెత్తి పాడెదం యేసు నామమును హెచ్చించెదం
స్తుతియాగము అర్పించెదం
సర్వోన్నతుని సన్నుతించెదం
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
- వంకర మార్గమును – తిన్నగా చేసెను
పాడైన బ్రతుకులను సరిచేసి నిలిపెను
మన దీనస్థితిని మార్చివేసెను
మన దుఃఖమును తొలగించెను
ప్రేమాస్వరూపుడు – దీర్ఘశాంతుడు - ఘనమైన కార్యములు – జరిగించియున్నాడు
ఏ కొదువ లేకుండా – నడిపించియున్నాడు
మనలను ఎంతో ప్రేమించెను గొప్ప దీవెనలు కురిపించెను
కరుణస్వరూపుడు – మహోపకారుడు - స్తుతులపై ఆసీనుడు – యెహోవా దేవుడు
లోక రక్షకుడు మన యేసు నాధుడు
నిండు మనసుతో కొనియాడేదం
మన చేతులెత్తి పూజించేదం
ఆత్మస్వరూపుడు – ఆరాధ్యనీయుడు
Sthothra geethamulu yehovaaku paadedham
sangeetha swaramulatho gaanamu chesedham
galamethi paadedham yesu naamamunu hechinchedham
sthuthiyaagamu arpinchedham
sarvonnathuni sannuthinchedham
Hallelujah hallelujah hallelujah
Hallelujah hallelujah hallelujah
- Vankara maargamunu thinnaga chesenu
paadaina brathukulanu sarichesi nilipenu
mana dheena sthithini maarchivesenu
mana dhukkamunu tholaginchenu
premaaswaroopudu dheergasaanthudu - Ghanamaina kaaryamulu jariginchiyunnaadu
ey kodhuva lekundaa nadipinchiyunnaadu
manalanu entho preminchenu goppa dheevenalu kuripinchenu
karunaaswaroopudu mahopakaarudu - Sthuthulapai aaseenudu yehovaa dhevudu
loka rakshakudu mana yesu naadhudu
nindu manasutho koniyaadedham
mana chethuletthi poojinchedham
aathma swaroopudu aaraadhyaneeyudu