• Home  /
  • Lyrics   /
  • Okasari Chudalani – Augustine Dandingi Telugu Christian Lyrics

Okasari Chudalani – Augustine Dandingi Telugu Christian Lyrics

Okasari Chudalani - Augustine Dandingi Telugu Christian LyricsOkasari Chudalani is the latest Telugu Christian song written, tuned and sung by “Shudda Hrudayam” fame pastor Augustine Dandingi and music composed by Uday. This song was released on September 02, 2020 through Augustine Dandingi YouTube channel.

Introdution to this song shared by Pastor Augustine Dandingi:
ఈ పాట పల్లవి 2004 డిసెంబర్ నెల లో రాయడం జరిగింది. చరణాలు 2015 లో రాయడం జరిగింది. 2004 నవంబర్ నెలలో దైవజనులు జేమ్స్ రెబ్బవరపు గారు, లీడర్స్ మీటింగ్ లో “ఆరాధన” అంటే “దేవునితో లోతైన సంబంధం”. ఒక ప్రియురాలు ప్రియుడి కోసం ఎదురుచూస్తున్నప్పుడు కలిగే భావన అని మాట్లాడుతూ పరమ గీతాలు గ్రంథం గురించి వివరించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని దినాలకు శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ (Harp and Bowl) లో నేను ఆరాధన నడిపిస్తూ ఉన్నప్పుడు నా తలంపుల లో అవే మాటలు రావడం జరిగింది. అప్పుడు ఈ పాటలోని పల్లవి రాయడం జరిగింది. అప్పటినుండి అనేకమైన Mega Crusades, Pastors Conferences లలో ఈ పాట ద్వారా ఆరాధన నడిపించాను. అద్భుతమైన దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉండేవారము. దాదాపు 2015 వరకు ఒక్క పల్లవి తోనే ఆరాధన నడిపిస్తూ ఉండేవాడిని. 2015 నవంబర్ నెలలో రెండు చరణాలు రాయడం జరిగింది. అంటే ఈ పాట పూర్తి కావడానికి దాదాపు పది సంవత్సరాలు పట్టింది. ఈ పాట వింటున్న వారు, పాడుతున్న వారు అందరూ కూడా దేవుని సన్నిధిని అనుభవించాలని ఆశిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక.

Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.

Song: Okasari Chudalani
Release Date: September 02, 2020
Lyrics, Tune & Vocals: Bro Augustine Dandingi
Music: Uday

TeluguEnglish

ఒకసారి చూడాలనీ
ఒకసారి తాకాలనీ
నీకోసం నే వేచి ఉన్నా

ఆరాధనా ఆరాధనా ఆరాధనా యేసుకే

  1. నిత్యము నిను చూడాలని
    నీతోనే నడవాలనీ
    నా గుండె లోతుల్లోని ఆశయ్యా
    నా ప్రియుడా – నా యేసయ్యా
    నీ ధ్యాసయే నా శ్వాసయ్యా
  2. ఒక్క క్షణము యుగమాయే
    గుండంతా బరువాయే
    నేను నిన్ను చూడని రోజునా
    నా ప్రియుడా – నా యేసయ్యా
    నీ ధ్యాసయే నా శ్వాసయ్యా

Okasaari choodaalani
okasaari thaakaalani
neekosam ne vechi unnaa

Aaradhanaa Aaradhanaa Aaradhanaa Yesuke

  1. Nithyamu ninu choodalani
    neethone nadavaalani
    naa gunde lothulloni aashayya
    naa priyudaa – naa yesayya
    nee dhyaasaye naa swaasayya
  2. Okka kshanamu yugamaaye
    gundanthaa baruvaaye
    nenu ninnu choodani rojunaa
    naa priyudaa – naa yesayya
    nee dhyaasaye naa swaasayya

Written by Admin

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

How to whitelist website on AdBlocker?

How to whitelist website on AdBlocker?

  1. 1 Click on the AdBlock Plus icon on the top right corner of your browser
  2. 2 Click on "Enabled on this site" from the AdBlock Plus option
  3. 3 Refresh the page and start browsing the site
error: Content is protected !!