Nisi Raathri – Joel Kodali, Nissy John Telugu Christian Lyrics
Nisi Raathri is the latest Christian single written by Telugu Christian song-writer, composer, Joel Sugunakar Kodali, sung by gospel singer, Nissy John and music composed by renowned Christian Music Director, Hadlee Xavier. This song was released April 17, 2023 presented by Friday for Christ through Joel Kodali Youtube channel.
Please listen to this song, worship the lord with truth and in spirit and be blessed.
Song : Nisi Raathri
Release Date : April 17, 2023
Lyrics : Joel Kodali
Vocals : Nissy John
Music : Hadlee Xavier
నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని
ఊపిరితో మిగిలెదనా ఉదయానికి
తడవు చేయక యేసు నను చేరుకో
నా ప్రక్కనే ఉండి నను పట్టుకో
భయముండగలదా నీవున్నచో
నీ కన్నులు నామీద నిలిచుండగా
నా చేయి నీ చేతిలో ఉండగా
- ఈ చీకటి సమయం నిలిచెను నా ఈ పయనం
కనిపించక దారులు మొదలాయెను కలవరము
వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా
తప్పించెదవని దేవా ఆశతో నే వేచితిని
నీవు గాక నాకిపుడు దిక్కెవ్వరు - నే చేసిన వాగ్ధానము లెన్నో ఉన్నాయి
నెరవేర్చు బాధ్యతలు ఇంకా మిగిలాయి
ఈ రేయి ఈ చోటే నేనాగి పోవలదు
రాతిరి గడిచేవరకు నీ చాటున నను దాచి
ఉదయమును చూపించుము నా కంటికి - అల్పము ఈ జీవితమని నేనెరిగితిని
కనురెప్పపాటున ఆవిరికాగలదు
అనుదినమిక నీ కృపనే నే కోరుచు
పయనింతును నా గురివైపు నిను ఆనుకుని
భయముండగలదా నీవున్నచో
నీ కన్నులు నామీద నిలిచుండగా
నా చేయి నీ చేతిలో ఉండగా