Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Nanu Kalugajesina
Release Date : January 25, 2024
Lyrics, Tune, Vocals, Music : A.R.Stevenson
- Telugu
- English
నను కలుగ జేసిన – విధము తలపోసిన
భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున
అ.ప: స్తుతులు చెల్లించుచున్నా అందువలన
- తన స్వరూపమున నరుని నిర్మించిన
అందమైన సృష్టిపైన అధికారమిచ్చిన
దేవుడు తనకంటే కొంతే నను తక్కువగాను చేసెను
ఇంత కృప పొందే యోగ్యం ఏముంది నాలోన - మంటిదేహమున మహిమను నింపిన
శ్రేష్టమైన వైభవమును ధరియింపజేసిన
దేవుడు తన గ్రంధమునందు నా దినములు రాసియుంచెను
ఇంత ప్రేమానురాగం ఏలనో నాపైన - ఘనపరచదగిన మన ప్రభువు చేసిన
దివ్యమైన ఆకసమును తారలను చూచిన
దేవుడు నను దర్శించుటకు నరుడను ఏపాటివాడను
ఇంత ఆత్మీయ బంధం ఎందుకో నాతోన
Nanu kalugajesina – vidhamu thalaposina
bhayamu aascharyamu puttunu hrudayamandhuna
Stuthulu chellinchuchunnaa andhuvalana
- Thana swaroopamuna naruni nirminchina
andhamaina srushtipaina adhikaaramicchina
dhevudu thanakate konthe nanu thakkuvagaanu chesenu
itha krupa podhe yogyam emundhi naalona - Mantidhehamuna mahimanu nimpina
sreshtamaina vaibhavamunu dhariyimpajesina
dhevudu thana grandhamunandhu naa dhinamulu raasiyunchenu
intha premaanuraagam elano naapaina - Ganparachadhagina mana prabhuvu chesina
dhivyamaina aakaasamunu thaaralanu choochina
dhevudu nanu dharsinchutaku narudanu epaativaadanu
intha aathmeeya bandham endhuko naathona