Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Naa Praanama Naa Samasthama
- Telugu
- English
నా ప్రాణమా నా సమస్తమా – ప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా
నా ప్రాణమా నా సమస్తమా
- పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి
నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
నే వెంబడింతు ప్రభు - అంధకారపు లోయలలో నేను నడచితిని
ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి
కంటి పాపగ నీవు నన్ను కాచితివి
కన్నతండ్రివి నీవని నిన్ను కొలచెదను
ఇలలో నిన్ను కొలచెదను - నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు
ఆత్మా ఫలములు దండిగా నీకై ఫలియింతును
నీవు చేసిన మేళ్లను నేనెట్లు మరతు ప్రభు
నీ కొరకు నే సాక్షిగ ఇలలో జీవింతును
నే ఇలలో జీవింతును
Naa praanama naa samasthamaa – prabhuni sthuthiyinchumaa
naa yesu chesina mellanu – neevu maruvakumaa
naa praanama naa samasthama
- Panikiraani nanu neevu paiki lepithivi
Kreesthane bandapaina nannu nilipithivi
naa adugulu stiraparachi balamu nichithivi
needhu adugu jaadalane vembadinthu prabhu
ne venbadinthu prabhu - Andhakaarapu loyalalo nenu nadichithivi
ey apaayamu raakunda nannu nadipithivi
kanti paapaga neevu nannu kaachitivi
kanna thandrivi neevani ninnu kolachedhanu
ilalo ninnu kolachedhanu - Needhu aathmatho nindugaa nannu nimpu prabhu
aathmaa phalamulu dhandigaa neekai phaliyinthunu
neevu chesina mellanu nenetlu marathu prabhu
nee koraku ne saakshiga ilalo jeevinthunu
ne ilalo jeevinthunu