Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Naa Praana Priyuda Yesu
Album: Andhra Kraisthava Keerthanalu, Hebron songs
Song No: 666 (AKK), 102 (Songs of Zion)
- Telugu
- English
నా ప్రాణప్రియుడా యేసురాజా
అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను
హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా
- అద్భుతకరుడా ఆలోచన
ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బహుప్రియుడా
మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ - విమోచన గానములతో
సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్
హర్షింతును నే పాడెదను నా ప్రభువా - గర్భమున పుట్టిన బిడ్డలన్
కరుణింపక తల్లి మరచునా
మరచినగాని నీవెన్నడు
మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా - రక్షణాలంకారములను
అక్షయమగు నీ యాహారమున్
రక్షకుడా నాకొసగితివి
దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును - నీ నీతిని నీ రక్షణను
నా పెదవులు ప్రకటించును
కృతజ్ఞతా స్తుతులతోడ
నీ ప్రేమను నే వివరింతును విమోచకా - వాగ్ధానముల్ నాలో నెరవేరెను
విమోచించి నాకిచ్చితివే
పాడెదను ప్రహర్షింతును
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Naa Praanapriyudaa Yesu Raajaa
Arpinthunu Naa Hrudayaarpana
Virigi Naligina Aathmathonu
Hrudayapoorvaka Aaraadhantho Sathyamugaa
- Adbhuthakarudaa Aalochana
Aascharya Samadhaana Prabhuvaa
Balavanthudaa Bahupriyudaa
Manoharudaa Mahimaraajaa Sthuthinchedan - Vimochana Gaanamulatho
Soundarya Prema Sthuthulatho
Namaskarinchi Aaraadhinthun
Harshinthunu Ne Paadedanu Naa Prabhuvaa - Garbhamuna Puttina Biddalan
Karunimpaka Thalli Marachunaa
Marachinagaani Neevennadu
Maruvavu Viduvavu Edabaayavu Karuna Raajaa - Rakshanaalankaaramulanu
Akshayamagu Nee Yaahaaramun
Rakshakudaa Naakosagithivi
Deekshatho Ninnu Veekshinchuchu Sthuthinthunu - Nee Neethini Nee Rakshananu
Naa Pedavulu Prakatinchunu
Kruthagnathaa Sthuthulathoda
Nee Premanu Ne Vivarinthunu Vimochakaa - Vaagdhaanamul Naalo Neraverenu
Vimochinchi Naakichchithive
Paadedanu Praharshinthunu
Hallelujah Hallelujah Hallelujah