Kummari O Kummari – Ashirvad Luke Telugu Christian Song Lyrics
Kummari O Kummari is the Old Telugu Christian Worship song from Andhra Kraisthava Keerthanalu. This song was digitally recorded in the album, Madhura Seva(Andhra Christian Songs) by John Charles Pilli, Aradhana Gospel Ministries, sung by Mahitha Charles, Vidyalankar, Nissi John, Gayatri, Anand & Vasanth and music composed by christian renowned music director, Ashirvad Luke.
Song: Kummari O Kummari
Album: Andhra Kraisthava Keerthanalu, Madhura Seva(Andhra Christian Songs)
Vocals: Mahitha Charles, Vidyalankar, Nissi John, Gayatri, Anand & Vasanth
Music: Ashirvad Luke
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా
- పనికిరాని పాత్రనని – పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా
సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి
ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి - విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి
ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా
ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా - లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని
పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్
ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్