Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Kannula Jaarina Kannillu
Release Date: February 22, 2024
Lyrics, Tune & Vocals: Pastor B Shalem Raju
- Telugu
- English
పల్లవి :-
కన్నులు జారిన కన్నీళ్లు
తడిపెను దేవుని పాదాలు
ఇప్పటినుండి నీ కళ్ళు
చూచును దేవుని కార్యాలు
అ.ప.
ఉందిలే దీవెన – ఎందుకావేదన
పొందిన యాతన – దేవుడే మరచునా
- పలుకాకి లోకం నిందించిన
ఏకాకివై నీవు రోధించిన
అవమాన పర్వాలు ముగిసేనులే
ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోలంతా నీ ముందు
తలలువంచేను ఇకముందు
( ఉందిలే దీవెన ) - అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన
ఆత్మీయుల ప్రేమ నిదురించిన
అసమానమైన నా దేవుని
బలమైన బాహువు నిను వీడునా
యేసు నిలిచాడు నీ ముందు
నీకు చేసెను కనువిందు
( ఉందిలే దీవెన )
Kannulu jaarina kanneellu
thadipenu dhevuni paadhaalu
ippatinundi nee kallu
choochunu dhevuni kaaryaalu
Undhile dheevena – endhukaavedhana
pondhina yaathana – dhevude marachunaa
- Palukaaki lokam nindhinchina
eakaakivai neevu rodhinchina
avamaana parwaalu mugisenule
aanandha geethaalu paadevule
navvinolantha neemundhu
thalaluvanchelu ikamundhu
( Undhile dheevena ) - Anukonani sramalenno edhirinchina
aathmeeyula prema nidhurinchina
asamaanamai naa dhevuni
balamaina baahuvu ninu veedunaa
yesu nilichaadu nee mundhu
neeku chesenu kanuvindhu
( Undhile dheevena )