Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Dunnani Beedu Bhoomulalo
Release Date: September 14, 2024
Lyrics: Sunny Raj Kodavati
Vocals: Enosh Kumar
Tune & Music: Asha Ashirwadh
- Telugu
- English
పల్లవి:
నడిపించు నా దేవా – జరిగించు నీ సేవ
చూపించు ఓ త్రోవ – పయనానికి ఓ ప్రభువా (2)
దున్నని బీడు భూములలో – ఎవ్వరూ పోని స్థలములలో
రక్షణ లేని మనుష్యులలో – మారుమూల పల్లెలలో (2)
- ఎవరో వేసిన పంటను కోసే – పరిచర్య వద్దయ్యా
నీ పిలుపును విని పరుగున వచ్చే – ఆత్మల నివ్వయ్య (2)
పరులకు చెందే స్వాస్థ్యము తినే – పురుగుగా వద్దయ్యా
నశించు దానిని వెదకి రక్షించే – భారము నివ్వయ్య (2) - ఎదిగే క్రమములో పిలుపును మరిచే – గుణమే వద్దయ్యా
ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా (2)
కష్టము లేక సుఖముగా వచ్చే – ఫలమే వద్దయ్యా
కన్నీటితో విత్తి ఆనందంతో కోసే – పంటను ఇవ్వయ్యా (2) - ఇతరుల ఆస్తిపై కన్ను వేసే – దొంగను నేను కానయ్యా
స్థిరపడి యున్న సంఘాలను నే కూల్చను యేసయ్యా (2)
నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా
మరణించగానే నిన్ను చేరే బాగ్యమునివ్వయ్యా (2)
Chorus:
Nadipinchu naa devaa – jariginchu nee seva
choopinchu oh throva – payanaaniki oh prabhuvaa (2)
dhunnani beedhu bhoomulalo – evvaru poni sthalamulalo
rakshana leni manushyulalo – maarumoolala pallelalo (2)
- Evaro vesina pantanu kosey – paricharya vaddhayyaa
nee pilupunu vini paruguna vache – aathmala nivvayya (2)
parulaku chendhey swaasthyamu thine – purugugaa vaddhayya
nasinchu dhaanini vedhaki rakshinche – bhaaramu nivvayya (2) - edhige kramamulo pilupunu mariche – guname vaddhayya
evarini thakkuva cheyani manase naalo nimpayyaa (2)
kastamu leka sukhamugaa vache – phalame vaddhayya
kanneetitho vithi aanandhamutho kosey – pantanu ivvayyaa (2) - Itharula aasthi pai kannu vesey – dhonganu nenu kaanayyaa
sthirapadi yunna sanghaalanu ne koolchanu yesayyaa (2)
naaku chaalina dhevudavu neeve yesayyaa
maraninchagaane ninnu cherey baagyamunivvayyaa (2)