Dhevuni Sevakulaara – A R Stevenson Telugu Christian Lyrics
Symphony Music presents Dhevuni Sevakulaara, a latest Telugu Christian song from the album, Naa Kshemadhaarama written, tuned, sung and music composed by Telugu Christian Gospel singer, song-writer, music composer, A R Stevenson. This song video was released on September 08, 2021 through Symphony Music YouTube Channel.
This song is a song of tribute to all the great servants of God and in memory of his father A D Sikhamani.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Dhevuni Sevakulaara
Album: Naa Kshemadhaarama
Song Release Date : September 08, 2021
Lyrics, Tune, Vocals, Music : A R Stevenson
Backing Vocals: Hananya, Bhushanam, Balu, Kezia, Mighty, Sofia, Jyothirmai, Arpitha
Label: Symphony Music
దేవుని సేవకులరా ప్రభుయేసుని యాజకులరా
జీవితమును పరిచర్యలో కరిగించుచున్న ఘనులారా
ఆత్మల సాధన దీక్షలో తరియించుచున్న ప్రియులారా
ఉన్నతపనికై నియమితులైన ధన్యులు మీరే కారా
మీరు చూపిన త్యాగం మాకు స్ఫూర్తిదాయకం
మీకు వందనం మీకై ప్రార్థిస్తున్నాం
- నిందలపాలవుతున్నా మౌనంగా భరియిస్తూ
గుండెలు నీరవుతున్నా పయనం కొనసాగిస్తూ
అందరి బాధలు పంచుకొని నిత్యం ప్రార్థిస్తూ
సంఘపు క్షేమం కోరుకొని సత్యం బోధిస్తూ
మందను కాచే కాపరులారా - దేహము పాడవుతున్నా ధైర్యముగా పయనిస్తూ
ఫలితం చేదవుతున్నా చిరునవ్వుతో కనిపిస్తూ
అంకితభావం పెంచుకొని సాక్షిగా జీవిస్తూ
స్వార్ధపు ఆశలు చంపుకొని నియమం పాటిస్తూ
భారము మోసే శ్రామికులారా - హింసలు ఎదురవుతున్నా శుభవార్తను ప్రకటిస్తూ
సాయము కరువవుతున్నా వరములు ఉపయోగిస్తూ
జీవపువాక్యం పట్టుకొని తప్పును ఖండిస్తూ
క్రీస్తునిసిలువను ఎత్తుకొని మాదిరి చూపిస్తూ
మార్గము చూపే భోధకులారా