Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Devudu Ledani
Release Date: September 19, 2020
Lyrics & Tune : Jasper Kunapo
Vocals: Kalpana Raghavendar
Music : Jonah Samuel
Guitars: Keba Jeremiah
- Telugu
- English
దేవుడు లేడని వాదములెందుకు
వెర్రితనమది అర్థము లేనిది
పాపము చేయుచు పరుగిడుచుంటివా
దేవుని ఉనికిని చంపుచు మదిలో
- శ్రేష్టమైనది సృష్టంతయును
సౌఖ్యములతో భూమిని మనకొసగె
సృష్టిని చూడగా కర్తయు కనపడే
దృష్టితో దేవుని కనుగొనుమా - మన మనః సాక్షియే దేవుని తెలుపగ
మంచి చెడులు మనిషికి తెలిసెను
మరచిపోకుమా మోసపోకుమా
మనుగడ దేవుని కృపయే సుమా - ప్రాణము పోయేడి స్థితి మనకొచ్చినా
ప్రభువా ప్రభువని పిలువక తప్పునా
వట్టి మాటలు కట్టిపెట్టుమిక
చివరకు దేవుడే దిక్కు సుమా - క్రీస్తుని జననము, పునరుత్థానము
జరిగిన అద్భుత కార్యములెన్నో
కట్టు కథలివా ? కొట్టి వేయుటకు
వ్రాసిన చరితమే నిజము సుమా! - దేవుని మాటలే బైబిలు గ్రంధము
దానిలో దేవుడే జీవము నిచ్చును
యేసుని రక్తమే పాపికి శరణము
ఎంతో మేలది గైకొనుమా
Devudu ledani vaadhamu lendhuku
verrithanamadhi arthamu lenidhi
paapamu cheyuchu parugiduchuntivaa
devuni unikini champuchu madhilo
- Sreshtamainadhi srushtanthayunu
soukyamulatho bhoomini manakosage
srushtini choodagaa karthayu kanapade
drushtitho devuni kanugonumaa - Mana manah saakshiye devuni thelupaga
manchi chedulu manishiki thelisenu
marachipokumaa mosapokumaa
manugada devuni krupaye sumaa - Praanamu poyedi sthithi manakochinaa
prabhuvaa prabhuvani piluvaka thappunaa
vatti maatalu kattipettumika
chivaraku devude dikku sumaa - Kreesthuni jananamu, punarutthaanamu
jarigina adbhutha kaaryamulenno
kattu kathalivaa ? kotti veyutaku
vraasina charithame nijamu sumaa! - Devuni maatale baibilu grandhamu
daanilo devude jeevamu nichchunu
yesuni rakthame paapiki saranamu
entho meladhi gaikonumaa