Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Devaloka Mahimanantha
Song Release Date: December 02, 2022
Lyrics, Tune & Music: A R Stevenson
Vocals: A R Stevenson and Sister Kezia
Label: Symphony Music
- Telugu
- English
దేవలోక మహిమనంతా భువిపైకి తెచ్చాడు
దీనురాలి కడుపునుండి యేసు ఉదయించాడు
మానుజాళి పై ప్రేమతో దేవదేవుడు
నరరూపమెత్తి బాలుడై నేల కాలు మోపినాడు
కలిగెను విడుదల సంతోషం క్రిస్మస్
వెలిగిన మనసుల సంబరం క్రిస్మస్
- చీకటిని దూరం చేసి దివ్యమైన కాంతిని చూపి
ఎప్పుడూ మన తోడై నడిపిస్తాడు
కీడు ఏది రాకుండా దీవెనలు పోకుండా
కంటి పాపలా కాచి భద్రం చేసే ప్రాణప్రియుడు - పాపితోటి స్నేహం చేసి పాపముల శిక్షను బాపి
ఎప్పుడూ మన మధ్యే నివసిస్తాడు
లోటు చూడనీకుండా ఆటంకాలు లేకుండా
అన్నింటిని సమకూర్చి సాయం చేసే ప్రాణప్రియుడు - వేదనను మాయం చేసి గుండెలోని బాధను మాన్పి
ఎప్పుడూ మనతోనే పయనిస్తాడు
శత్రుబారి పడకుండా ఆశయాలు చెడకుండా
చుట్టూ కేడెమై యుండి కార్యం చేసే ప్రాణప్రియుడు
Devaloka mahimanthaa bhuvi paiki thechaadu
dheenuraali kadupu nundi yesu udhayinchaadu
manujaalipai prematho devadevudu
nararoopamethi baaludai nela kaalu mopinaadu
Kaligenu vidudhala santhosham christmas
veligina manasula sambaram christmas
- Cheekatini dooramchesi divyamaina kaanthini choopi
yeppudu manathodai nadipisthaadu
keedu yedhi raakundaa deevenalu pokundaa
kanti paapalaa kaachi bhadram chese praana priyudu - paapithoti sneham chesi paapamula sikshanu baapi
yeppudu mana madhye nivasisthaadu
lotu choodaneekundaa aatamkaalu lekundaa
annintini samakoorchi saayam chese praana priyudu - Vedhananu maayam chesi gundeloni baadhanu maanpi
yeppudu manathone payanisthaadu
shathru baari padakundaa aasayaalu chedakundaa
chuttu kedamai yundi kaaryam chese praana priyudu