Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Dayaa Samkalpam
Release Date: March 02, 2023
Lyrics, Tune & Vocals: Hosanna Ministries featuring Pastor Freddy Paul
Label: Hosanna Ministries
Producer: Hosanna Ministries
- Telugu
- English
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానైయున్నా ప్రాణప్రియుడా యేసయ్యా
నిన్ను చూడాలని ( నిన్ను చేరాలని )
నా హృదయమెంతో ఉల్లసించుచున్నది
- నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది
పవిత్రురాలైన కన్యకగా నీ యెదుట నేను నిలిచెదను
నీ కౌగిలిలో నేను విశ్రమింతును - నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది
మర్మమైయున్న నీవలె రూపించుచున్నది
కలంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను
యుగయుగాలు నీతో ఏలెదను - నీ కృప బాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది
తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది
అక్షయమైన దేహముతో అనాది ప్రణాలికతో
సీయోనులో నీతో నేనుందును
Gaganamu cheelchukoni ghanulanu theesukoni
nannu konipova raanaiyunna praana priyudaa yesayya
ninnu choodaalani ( ninnu cheraalani )
naa hrudhayamentho ullasinchuchunnadhi
- Nee dhayaa samkalpame nee premanu panchinadhi
nee chittame naalo neraveruchunnadhi
pavithruraalaina kanyakagaa nee yedhuta nenu nilichedhanu
nee kougililo nenu visraminthunu - Nee mahimaiswaryame gnaana sampadha nichinadhi
marmamaiyunna neevale roopinchu chunnadhi
kalankamuleni vadhuvunai nireekshanatho ninnu cheredhanu
yugayugaalu neetho eyledhanu - Nee krupa baahulyame aiswaryamu nichinadhi
thejovaasula swaasthyam anugrahinchinadhi
akshayamaina dhehamutho anaadhi pranaalikatho
seeyonulo neetho nenundhunu