Ashrayuda Naa – Hosanna Ministries Telugu Christian Lyrics
Ashrayuda Naa Yesayya is the latest Telugu Christian song from the album, Dayakshetram (Vol-35) released by Hosanna Ministries featuring Senior Pastor, Singer, song-writer, Pastor Ramesh and music arranged by renowned christian music director, Pranam Kamlakhar. This song video was released on March 06, 2025 through Hosanna Ministries YouTube channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Ashrayuda Naa Yesayya
Release Date: March 06, 2025
Lyrics, Tune & Vocals: Hosanna Ministries featuring Pastor Ramesh
Music: Pranam Kamlakhar
Label: Hosanna Ministries
Producer: Hosanna Ministries
ఆశ్రయుడా నా యేసయ్యా
స్తుతి మహిమ ప్రభావము నీకేనయా
విశ్వవిజేతవు – సత్యవిధాతవు
నిత్యమహిమకు – ఆధారము నీవు
లోక సాగరాన క్రుంగినవేళ
నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి – నను చేరదీసిన నిర్మలుడా
నీకేనయా ఆరాధన – నీకేనయా స్తుతి ఆరాధన
తెల్లని వెన్నెల కాంతివి నీవు
చల్లని మమతల మనస్సే నీవు
కరుణనుచూపి కలుషము బాపి
నను ప్రేమించిన ప్రేమవు నీవు
జనులకు దైవం – జగతికి దీపం
నీవుగాక ఎవరున్నారు
నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహరాజువు
జీవిత దినములు అధికములగునని
వాగ్దానము చేసి దీవించితివి
ఆపత్కాలమున అండగనిలిచి
ఆశలజాడలు చూపించితివి
శ్రీమంతుడవై సిరికేరాజువై
వెతలనుబాపి నాస్థితి మార్చితివి
అనురాగమే నీ ఐశ్వర్యమా సాత్వికమే నీ సౌందర్యమా
నీచిత్తముకై అరుణోదయమున
అర్పించెదను నా స్తుతి అర్పణ
పరిశుద్ధులలో నీ స్వాస్థ్యముయొక్క
మహిమైశ్వర్యము నే పొందుటకు
ప్రతి విషయములో స్తుతి చెల్లించుచు
పరిశుద్ధాత్మలో ప్రార్థించెదను
పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా