Andhaala Chinni Gootilona – Sreshta Karmoji Telugu Christian Lyrics
Andhaala Chinni Gootilona is the latest Telugu Christian Song written, tuned & sung by Sreshta Karmoji, daughter of renowned Man of God Pastor Samuel Karmoji and music composed by Jonah Samuel. This song was released on February 20, 2023 through Samuel Karmoji YouTube channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Andhaala Chinni Gootilona
Release Date: February 20, 2023
Lyrics, Tune & Vocals: Sreshta Karmoji
Music: Jonah Samuel
అందాల చిన్ని గూటిలోన – పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను – నింగిలో ఎగిరాను
ఈ చిన్ని జీవికి రూపం ప్రాణం – అన్నీ ఇచ్చింది యేసే
ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ – జత కలిపి పాడమ్మ
లేచే ప్రతి ఉదయం – పాడే నా ప్రాణం
పదిలముగా కాచే – ప్రభువే నా లోకం
- విత్తలేదు నేను కోయలేదు – కొట్లలో కూర్చుకోలేదు
కొరతంటూ నాకు తెలియదు – కలతంటూ నాకు లేనేలేదు
పరలోక తండ్రి నా కొరకు అన్నీ – సమకూర్చుచున్నాడులే - పిచ్చుక విలువ కాసే ఐనా – రాలునా తండ్రి కాదన్నా
తన రూపునే మీకు ఇచ్చుకున్న – తన కన్నా యెవరన్నా ప్రేమించునా?
శ్రేష్టులైన మీరు భయపడ తగునా – మీ తండ్రి తోడుండగా