Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Amarudaa
Album: Na Hrudaya Saradhi (31st Album by Hosanna Ministries)
Release Date : March 04, 2021
Lyrics, Tune : Hosanna Ministries
Vocals : Pastor Ramesh
Label : Hosanna Ministries, Rajamundry
Click Here for Full Album Lyrics
- Telugu
- English
అమరుడవు నీవు నా యేసయ్య ఆదియు అంతము నీవేనయ్యా
ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో
సొమ్మసిల్లక – సాగిపోదును సీయోను మార్గములో
స్తోత్ర గీతము – ఆలపింతును నీ దివ్య సన్నిధిలో
- శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే
శిక్షకు కావే శోధనలన్ని ఉన్నత కృపతో నను నింపుటకే
ప్రతి విజయము నీకంకితం నా బ్రతుకే నీ మహిమార్ధం
లోకమంతయు – దూరమైనను – నను చేరదీసెదవు
దేహమంతయు – ధూళియైనను – జీవింపజేసెదవు - వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా
పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము
తీర్చగలనా నీ ఋణమును మరువగలనా నీ ప్రేమను
కన్న తండ్రిగ – నన్ను కాచి – కన్నీరు తుడిచితివి
కమ్మనైన – ప్రేమచూపి – కనువిందు చేసితివి - జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా
మరణము గెలచిన పరిశుద్దుడవు పునరుత్ధానుడవు నీవయ్యా
జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతి నిత్యము
గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన
ఆత్మ దీపము – వెలిగించినావు – నీకే ఆరాధన
Amarudavu neevu naa yesayya aadhiyu anthamu neevenayyaa
aadhilonunna nee vaakyame aadharinchenu srama kolimilo
sommasillaka saagipodhunu seeyonu maargamulo
sthothra geethamu aalapinthunu nee divya sannidhilo
- Shakthiki minchina samaramuloa nerpithivi naaku nee chitthame
sikshaku kaave shodhanalanni unnatha krupatho nanu nimputake
prathi vijayamu neekankitham naa brathuke nee mahimaardham
lokamanthayu dooramainanu nanu cheradheesedhavu
dhehamanthayu dhooliyainanu jeevimpa jesedhavu - Vekuva kurisina chirujallulo nee krupa naalo pravahinchagaa
pondhithinenno upakaaramulu navanoothaname prathi dinamu
theerchagalanaa nee runamunu maruvagalanaa nee premanu
kanna thandrigaa nannu kaachi kanneeru thudichithivi
kammanaina prema choopi kanuvindhu chesithivi - Jaldharu vrukshamunu polina gunaseeludavu neevenayya
maranamu gelichina parishuddhudavu punaruddhanudavu neevayya
jayaseeludavu neevenani aaraadhinthunu prathi nithyamu
gunde gudilo nindinaavu neeke aaraadhana
aathma deepamu veliginchinaavu neeke aaraadhana