Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Aakasame Pattanodu
Release Date: November 05, 2021
Lyrics & Producer: K R John
Vocals: Revanth & Priya Himesh
Music: K Y Ratnam
- Telugu
- English
అవనిలో ఉద్భవించే ఆదిసంభూతిని చూడరే
పుడమియే పరవసించే పసిబాలుని చూడగనే
పసిబాలుని చూడగనే
ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై వెలసినాడు రక్షకుడు
ఆనందమే మహా ఆనందమే
అందరికి ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే
యేసు జననం అద్భుతమే
చరణం 1:
అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు
ఆది అంతమైన పరలోక నాధుడు
ఆదియందు వాక్యంబుగా సృష్టి కార్యము జరిగించినాడు
ఆనాది నుండి జ్ణానంబుగా సృష్టి క్రమము నడిపించినాడు
అన్నిటిని కలిగించిన మహరాజు కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు
ప్రేమను పంచే ప్రేమామయుడు
రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు
చరణం 2:
పాపమే లేని సుగుణాల సుందరుడు
శాపము బాపను జన్మించెను చూడు
నిత్యముండు నీతి సూర్యుడు సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు
ప్రేమను పంచే పావనాత్ముడు పశుల పాకలో పవళించినాడు
సర్వాధికారియైన మహారాజు దీనులకు దీవెనగా దిగివచ్చినాడు
Avanilo udbhavinche aadhisambhuthuni chudarey
pudamiye paravasinche pasibaaluni chudaganey
pasibaaluni chudaganey
Aakasamey pattanodu dharanilo puttinaadu
dhaaveedu puramunandhu dheenudai velasinaadu rakshakudu
Aanandhame mahaa aanandamey
andhariki ilalo santhoshamey
aascharyamey idhi adbhuthamey
yesu jananam adbhuthamey
Verse 1:
Adhrushya devuni mahimaa swaroopudu
aadhi anthamaina paraloka naadhudu
aadhiyandu vaakyambugaa srushtikaaryamu jariginchinaadu
anaadi nundi gnaanambugaa srushtikramamu nadipinchinaadu
Premanu panchey premaamayudu
rakshana ichi rakshinchey devudu
Verse 2:
Paapamey leni sugunaala sundarudu
shaapamu baapanu janminchenu chudu
nithyamundu neethi suryudu sathyasaakshiga ilakochinaadu
premanu panchey paavanaathmudu pasulapaakaloo pavalinchinaadu
sarvaadhikaariyaina mahaaraaju dheenulaku dheevenaga dhigivachinaadu